
మూడు ట్యాంకుల పనులు మొదలు కాలే..
మిర్యాలగూ టౌన్ : అమృత్ 2.0 పథకం కింది మిర్యాలగూడలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.173.07 కోట్లు మంజూరు కాగా 136 కిలో మీటర్లు యూజీడీ వేయాల్సి ఉంది. 33 వేల ఇళ్లకు లింకులు కల్పించాలి. ఇప్పటి వరకు 23.16 కిలో మీటర్లు మాత్రమే పనులు జరిగాయి. తాగునీటి సరఫరాకు రూ.93 కోట్లు మంజూరయ్యాయి. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌తో పాటు కంపసాగర్ చెరువు నుంచి నీటిని తీసుకుని మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు వద్ద వాటర్ ట్రీట్‌మెంటు ప్లాంట్ నిర్మించి అక్కడ శుద్ధిచేసిన నీటిని కొత్తగా నిర్మించే పది వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం 60 కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేయాలి. కానీ.. వాటర్ ట్రిట్‌మెంటు ప్లాంట్‌తోపాటు పైపులైన్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇక, హౌజింగ్‌బోర్డులో 2, ఇందిరమ్మ కాలనీలో 2, గ్రీన్ హోం, తాళ్లగడ్డ, మార్కెట్ యార్డుల్లో మొత్తం 7 ట్యాంకులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా మిగిలిన మూడు ట్యాంకుల పనులు ఇంకా ప్రారంభించ లేదు.