
జగన్నాథుడి రథయాత్ర
చింతపల్లి : మండల కేంద్రం హరి నామస్మరణతో మార్మోగింది. భక్తుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలతో జగన్నాథుడి రథయాత్ర బుధవారం వైభవంగా సాగింది. కూకట్‌పల్లి ఇస్కాన్ టెంపుల్ సౌజన్యంతో సాయి సన్నిధి బాబా దేవాలయం ఆధ్వర్యంలో పూరి జగన్నాథుడి (శ్రీకష్ణుడు) రథయాత్ర చింతపల్లి మండల కేంద్రంలోని రాజా రాజేశ్వర దేవాలయం నుంచి సాయి సన్నిధి శ్రీకృష్ణ గోకులం వరకు నిర్వహించారు. రథయాత్రకు మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులకు నైవేద్యం సమర్పణ, మంగళహారతి అనంతరం భక్తులకు మహా ప్రసాదం అందజేశారు.