
మంత్రి ఉత్తమ్ ఓఎస్‌డీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి
నల్లగొండ : రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్‌రెడ్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా నల్లగొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జెడ్పీ సీఈఓ) నంద్యాల ప్రేమ్‌కరణ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో జిలాల్లో పలు మండలాల్లో ఎంపీడీఓగా పనిచేశారు.
జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓగా శ్రీనివాసరావు
నల్లగొండ : నల్లగొండ జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓఎస్‌డీగా నియమితులు కావడంతో జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓగా డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గురువారం ఆయన ఇన్‌చార్జి బాధ్యతలను స్వీకరించారు.
పోలీస్ కుటుంబాల పిల్లలకు సమ్మర్ క్యాంపు
నల్లగొండ : పోలీస్ కుటుంబ సభ్యుల పిల్లలకు మెగా సమ్మర్ క్యాంప్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థులకు ఆటవిడుపుగా సమ్మర్ క్యాంప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ క్యాంపులో 100 మంది విద్యార్థులకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఆటలు, యోగా వల్ల పిల్లలకు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్‌ఐలు సూరప్పనాయుడు, సంతోష్, శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐ రాజీవ్, అశోక్,ి ఈటి.నాగరాజు, కరాటే మాస్టర్ వంశీ, యోగా మాస్టర్ కిషన్ కుమార్ పాల్గొన్నారు.
లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : భూ భారతి చట్టం – 2025 అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17లోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో కోరారు. శిక్షణ శిబిరాలు ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు నిర్వహిస్తామని తెలిపారు.
టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు
కేతేపల్లి : జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్‌ప్లాజా వద్ద గురువారం జిల్లా ఎన్‌ఫోర్స్, ఎకై ్సజ్‌శాఖ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని జిల్లా పోలీసులకు అందిన సమాచారంతో చండూరు, నల్లగొండ, నకిరేకల్ డివిజన్లకు చెందిన దాదాపు 50 మంది పోలీసులు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎలాంటి గంజాయి పట్టుబడ లేదని తెలిసింది.
లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించొద్దు
గుర్రంపోడు : లైసెన్స్ లేని వారు విత్తనాలను విక్రయించొద్దని జిల్లా వ్యవసాయాధికారి పి.శ్రవణ్‌కుమార్ అన్నారు. గురువారం గుర్రంపోడు, కొప్పోలులో ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు డీలర్ల వద్ద నుంచి మాత్రమే పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రశీదులు పొంది భద్రపర్చుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ను పరిశీలించి మండలంలో 473 మెట్రిక్ టన్నుల యూరియా, 147 మెట్రిక్ టన్నుల డీఏపీ, 43 మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ పాస్పేట్ అందుబాటులో ఉందని తెలిపారు. ఆయన వెంట ఏఓ కంచర్ల మాధవరెడ్డి, ఏఈఓలు ఉన్నారు.

మంత్రి ఉత్తమ్ ఓఎస్‌డీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి

మంత్రి ఉత్తమ్ ఓఎస్‌డీగా ప్రేమ్‌కరణ్‌రెడ్డి