ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు

May 24 2025 1:09 AM | Updated on May 24 2025 1:09 AM

ప్రశా

ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు

నల్లగొండ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం జిల్లాలోని 12 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్‌ పరీక్షకు 2036 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 1851 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ పరీక్షకు 282 మందికి 231 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ దస్రూనాయక్‌ తెలిపారు.

వృత్యంతర శిక్షణతో ఆధునిక బోధన

మిర్యాలగూడ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక బోధనా పద్ధతులు అమలు పర్చడానికి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఉపయోగపడుతుందని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో.. దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. విద్యాశాఖ ఆదేశానుసారం పాఠశాల పునః ప్రారంభానికి ముందే ప్రతి ఉపాధ్యాయుడు ఐదు రోజులు శిక్షణ పొంది ఉండాలన్నారు. శిక్షణ అంశాలను ఉపాధ్యాయుల నుంచి అడిగి తెలుసుకోని సమాధానాలు రాబ ట్టారు. శిక్షణలో వసతులు, భోజన సౌకర్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులంతా మాతృభాష తెలుగులో దారాళంగా చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను మెరుగుపరచాలని అన్నారు. జూన్‌ 6 నుంచి ఉపాధ్యాయులంతా బడిబాట కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓలు లావూరి బాలు, ఎం.బాలాజీనాయక్‌, ఆర్‌.వరలక్ష్మి ఉన్నారు.

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

నల్లగొండ టూటౌన్‌ : పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సమతా సంక్షేమ సమితి, దళిత మోర్చాల ఆధ్వర్యంలో టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ఇవ్వనున్న పురస్కారాల పండుగ బ్రోచర్లను శుక్రవారం ఆయన నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌, చింతా ముత్యాల్‌రావు, రావెళ్ల కాశమ్మ, ఫకీరు మోహన్‌రెడ్డి, దాసోజు యాదగిరిచారి పాల్గొన్నారు.

యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్పమాలికలు, పట్టువస్త్రాలు, బంగారు, వైజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు.

ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు1
1/2

ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు

ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు2
2/2

ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement