
బస్తాలు సర్దుబాటు చేస్తున్నాం
నల్లగొండ : జిల్లాలో బస్తాల కొరత వాస్తవమేనని.. అయినప్పటికీ సర్దుబాటు చేస్తున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ‘సాక్షి’లో ‘గోనె సంచుల గోల్‌మాల్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గన్నీ బ్యాగులు కొత్తవి, పాతవి మిల్లర్ల నుంచి తీసుకుని పంపిణీ చేస్తామని.. అయితే రంద్రాలున్న బస్తాలను తిరిగి పంపాలని కేంద్రాల నిర్వాహకులకు చెప్పామని పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల సరఫరాలో కొత్త బ్యాగులతో పాటు పాతవి కూడా సరఫరా చేయాలనే నిబంధన ఉందని తెలిపారు.
ఫ పౌర సరఫరాల శాఖ డీఎం హరీష్

బస్తాలు సర్దుబాటు చేస్తున్నాం