
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
నకిరేకల్: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన కొప్పుల శ్రీజ ఎంపికైంది. ఇంటర్మీ డియట్ పూర్తిచేసిన శ్రీజ ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీజ పాల్గొంటుందని తెలిపారు.