మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు | - | Sakshi
Sakshi News home page

మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు

May 3 2025 8:23 AM | Updated on May 3 2025 8:23 AM

మన దర

మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు

రజాకార్‌ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ, ‘యూనిటీ ది మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ డాక్యుమెంటరీ దర్శకుడు విజయ్‌కుమార్‌ను వరించిన పురస్కారం

చిట్యాల, భూదాన్‌పోచంపల్లి : ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. చిట్యాల పట్టణానికి చెందిన యాట సత్యనారాయణ, భూదాన్‌పోచంపల్లికి చెందిన బడుగు విజయ్‌కుమార్‌లకు ఈ పురస్కారం దక్కింది. తెలంగాణలో జరిగిన రజాకార్ల దుశ్చర్యలపై, సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటంపై రూపొందిన చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భువనగిరి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మొదటిసారి దర్శకత్వం వహించిన వారి కేటగిరీలో యాట సత్యనారాయణ ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్‌పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్‌ ‘యూనిటీ ది మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో దాదాసాహెబ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే15వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 200 చిత్రాలను ప్రదర్శించగా 25 చిత్రాలు వివిధ కేటగిరీలలో పురస్కారానికి ఎంపికయ్యాయి. అందులో ఉత్తమ దర్శకులుగా యాట సత్యనారాయణ, బడుగు విజయ్‌కుమార్‌ ఎంపికయ్యారు. యా ట సత్యనారాయణ గురువారం రాత్రి జరిగిన ఫి ల్మ్‌ ఫెస్టివల్‌లోనే పురస్కారం అందుకోగా.. బడు గు విజయ్‌కుమార్‌ శనివారం అందుకోనున్నారు.

మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు1
1/2

మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు

మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు2
2/2

మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement