
నకిరేకల్‌లో డీలక్స్ బస్‌స్టాప్ ఎత్తివేత
నకిరేకల్ : మున్సిపాలిటీ, నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌లో ఆర్టీసీ డీలక్స్ బస్‌స్టాప్‌ను ఎత్తివేసింది. ఇప్పటి వరకు సూర్యాపేట నుంచి నకిరేకల్, తాటికల్ మీదుగా నల్లగొండకు డీలక్స్ బస్సులు నడిపింది. రోజూ 20 ట్రిప్పులు నడిచేవి. ఈ డీలక్స్ బస్సులతో నకిరేకల్ ప్రాంత ప్రయాణికులు నల్లగొండ, సూర్యాపేట వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్‌ల్లో మహలక్ష్మి పథకం అమలుతో ప్రయాణికుల రద్దీ విపరితంగా పెరిగింది. దీంతో చాలా మంది డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారు. ఇటీవల ఆ డీలక్స్ బస్సుల స్టాప్‌ను నకిరేకల్‌లో ఎత్తివేసి.. వాటిని నాన్‌స్టాప్ సర్వీసులుగా మార్చారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార కేంద్రంగా ఉన్న నకిరేకల్‌లో డీలక్స్ బస్‌స్టాప్‌ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈవిషయంపై నకిరేకల్ ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ పల్స వీరయ్యను వివరణ కోరగా.. నకిరేకల్‌లో డీలక్స్ బస్‌స్టాప్ పునరుద్ధరించే విషయాన్ని ఆర్టీసీ డీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
స్టాప్‌ను పునరుద్ధరించాలి
కొంతకాలంగా నకిరేకల్ స్టాప్‌గా సూర్యాపేట – నల్లగొండకు వయా తాటికల్ మీదుగా ఆర్టీసీ డీలక్స్ బస్సులు నడిపింది. కొన్ని రోజుల నుంచి నకిరేకల్ స్టాప్‌ను ఎత్తివేసి నాన్‌స్టాప్ సర్వీస్‌గా మార్చారు. ప్రభుత్వ ఉద్యోగులు నిత్యం నల్లగొండ – నకిరేకల్ – సూర్యాపేటకు రాకపోకలు సాగిస్తుంటారు. మహాలక్ష్మి ఫథకంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగులు చాలా మంది డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారు. నకిరేకల్‌లో స్టాప్ ఎత్తివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నకిరేకల్‌లో స్టాప్‌ను పునరుద్ధరించాలని నల్లగొండ, సూర్యాపేట ఆర్టీసీ డీఎంలకు విన్నవించాం.
– బెల్లి యాదయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నకిరేకల్
ఫ నాన్ స్టాప్‌గా సూర్యాపేట– నల్లగొండ డీలక్స్ సర్వీస్
ఫ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నకిరేకల్‌లో డీలక్స్ బస్‌స్టాప్ ఎత్తివేత