నల్లగొండ : ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్‌గా రేపాల మదన్‌మోహన్, డిస్ట్రిక్ట్–1 వైస్ గవర్నర్‌గా కేవీ ప్రసాద్, డిస్ట్రిక్ట్–2 వైస్ గవర్నర్‌గా కోడె సతీష్‌కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం నల్లగొండలో జిల్లా గవర్నర్ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన లయన్స్ క్లబ్ వార్షికోత్సవంలో వీరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని సమాజ సేవే పరమావదిగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దీపక్ బట్టాచార్య, రాజిరెడ్డి, నరేందర్‌రెడ్డి, తీగల మోహన్‌రావు, గోలి అమరేందర్‌రెడ్డి, బీమయ్య, శివప్రసాద్, కేవీ.ప్రసాద్, కోటేశ్వర్‌రావు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.