ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Mar 19 2025 1:49 AM | Updated on Mar 19 2025 1:48 AM

నకిరేకల్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఏజెంట్లను నియమించుకుని సంసిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్‌ జే.శ్రీనివాస్‌ సూచించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నకిరేకల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయా పార్టీల నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్‌ స్టేషన్ల ఓటర్‌ జాబితాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 1 వరకు ఆయా పోలింగ్‌ స్టేషన్‌ ఓటర్ల జాబితాలు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ జమురుద్దీన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ యశ్వంత్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అరవింద్‌, రాజు, వివిధ పార్టీల నాయకులు యాతాకుల అంజయ్య, పన్నాల రాఘవరెడ్డి, యల్లపురెడ్డి సైదిరెడ్డి, రాచకొండ వెంకట్‌గౌడ్‌, పల్స శ్రీను, కె.రవి, శ్రీను పాల్గొన్నారు.

ఆర్థిక వ్యూహాలతోనే సమాజ పురోభివృద్ధి

మిర్యాలగూడ : విద్యతోనే కాకుండా ఆర్థిక వ్యూహాలతో సమాజ పురోభివృద్ధి సాధించగలమని గుల్బర్గా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ వాసుదేవ్‌ సెడెం అన్నారు. మిర్యాలగూడలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సులో భాగంగా చివరి రోజైన మంగళవారం ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెమినార్‌ ద్వారా కొత్త ఆర్థిక సూత్రాలు, ఆలోచనలను సమర్థవంతంగా ఆవిష్కరించగలిగామన్నారు. ఆర్థిక సూత్రాలపై సవాళ్లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై లోతైనా చర్చలు జరిపామన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ అన్నాసాగర్‌, రాపోలు భాస్కర్‌, డాక్టర్‌ నరేష్‌, కాంగ్రెస్‌ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ శ్రేణులు

సంబరాలు నిర్వహించాలి

నల్లగొండ: ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లులకు శాసనసభలో ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని, డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీలో బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు. అన్ని మండల కేంద్రాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి బాణాసంచా కాల్చాలన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ శ్రేణులతోపాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement