నల్లగొండ : ఒంటిపూట బడులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1నుంచి 9వ తరగతి వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు. అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపిస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు ఒంటిపూట బడులు అమలు చేయాలని, విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
టెన్త్ పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మార్పులు
పదో తరగతి పరీక్షలు ఈనెల 21నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఒంటి పూట బడుల వేళల్లో మార్పులు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం ఒంటి గంటకు పాఠశాలలకు చేరుకుని మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తరగతులకు హాజరవుతారు.
ఫ ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు