తూకాల్లో.. తేడాలు! | - | Sakshi
Sakshi News home page

తూకాల్లో.. తేడాలు!

Mar 15 2025 1:38 AM | Updated on Mar 15 2025 1:38 AM

తూకాల

తూకాల్లో.. తేడాలు!

ఎలక్ట్రానిక్‌ కాంటాలోనూ అదే తీరు

కాంటాలకు ఐస్కాంతం పెట్టి మోసం

వినియోగదారులను మోసం చేస్తున్న కొందరు వ్యాపారులు

అక్కడక్కడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తూనికలు కొలతల శాఖ

నేడు జాతీయ వినియోదారుల దినోత్సవం

371 కేసులు నమోదు...

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేసి గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 371 కేసులు నమోదు చేశారు. తప్పుడు తూకాలకు సంబంధించి 96 కేసులు నమోదవగా, ప్యాకేజీలో తక్కువ తూకం, దానికి కంజూమర్‌ నెంబర్‌, తేదీ, ధర లేకపోవడం లాంటి కారణాలతో 243 కేసులు నమోదు అయ్యాయి. సకాలంలో వెరిఫికేషన్‌ చేయించుకోని పెట్రోల్‌ బంక్‌లపై 7 కేసులు, బంగారు దుకాణాలపై 25 కేసులు నమోదు చేశారు. కాగా వెరిఫికేషన్‌ ఫీజు ద్వారా రూ.81,13,572 లు రాగా, జరిమానాల ద్వారా రూ.35,11,000 జిల్లా తూనికలు కొలతల శాఖకు ఆదాయం సమకూరింది.

నల్లగొండ టూటౌన్‌ : కూరగాయల నుంచి బంగారం వరకు తూకాల్లో మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. చూస్తే పది, ఇరవై గ్రాముల తేడా కనిపించినా ఇదే అతి పెద్ద మోసం అని లోతుగా పరిశీలిస్తే గానీ తెలియడం లేదు. సాధారణ కాంటాల నుంచి ఎలక్ట్రానిక్‌ కాంటాలకు మారినా వినియోగదారులను కొందరు వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. వినియోగదారులకు ఎక్కడా అనుమానం రాకుండా కాంటాల్లోనే సెట్‌ చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కూరగాయల్లో కిలోకు 20 గ్రాములు తేడా వస్తుండగా, మటన్‌ అయితే 100 గ్రాములు, చికెన్‌ 70 గ్రాములు, ఇతర కిరాణ సరుకులు సైతం కిలోకు వస్తువులను బట్టి 10 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తక్కువ వచ్చేలా కాంటాల్లోనే సెట్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్‌ కాంటాలపై వినియోగదారులకు సరైన అవగాహన లేకపోవడం ఒక కారణం. ఇక.. వ్యాపారులను ప్రశ్నిస్తే ఏమైనా అంటారేమోననే మొహమాటం మరో కారణం. దీంతో తూకంలో మోసాలపై వ్యాపారులను వినియోగదారులు ప్రశ్నించిన దాఖలాలు తక్కువగానే ఉంటున్నాయి.

నల్లగొండ పట్టణంలో పాత బస్తీలో ని ఓ షాపులో 25 కిలోల బియ్యం బస్తాను ఎలక్ట్రానిక్‌ కాంటాపై తూకం వేసి పరిశీలించగా 24.510 కిలోలు మాత్రమే ఉంది. 490 గ్రాములు తక్కువగా ఉంది. అదే విధంగా 26 కేజీల బియ్యం బస్తా తూకం వేయగా 25 కేజీల 630 గ్రాములు ఉంది. ఈ బస్తా కూడా 370 గ్రామాలు తేడా వచ్చింది. మరో బస్తా తూకం వేయబోగా దుకాణం యజమాని సదరు కాంటా సరిగా పని చేయడం లేదంటూ తూకం వేయకుండా అడ్డుకోవడం గమనార్హం.

కేసుల వివరాలు..

తప్పుడు తూకాల

కేసులు 96

ప్యాకేజీల కేసులు 243

వ్యాపారుల వంచన..

జిల్లా వ్యాప్తంగా ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్‌ కాంటా వినియోగిస్తున్నా దాని కింద ఎవరికీ కనిపించని విధంగా ఐస్కాంతం ఉపయోగిస్తుండడంతో కేటుగాళ్లు ఎవరికీ దొరకడం లేదు. కొన్ని దుకాణాల్లో రెండు కాంటాలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చోట్ల వ్యాపారులైతే పెద్ద, చిన్న ఎలక్ట్రానిక్‌ కాంటాల లోపలనే తమకు అవసరమైన రీతిలో సెట్టింగ్‌ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిపై 26 కిలోల తూకం వేస్తే అరకిలో నుంచి కిలోన్నర తూకం తక్కువగా వస్తున్నట్లు చర్చ జరుగుతుంది.

బంగారు దుకాణాలపై 25

పెట్రోల్‌

బంక్‌లపై 07

నల్లగొండలోని కిరాణం షాపులో 5 కేజీల ఉల్లిగడ్డ కొనుగోలు చేసి దానిని మరో చోట కాంటా వేయగా 4 కేజీల 600 గ్రాములు మాత్రమే ఉంది. 400 గ్రాముల ఉల్లి గడ్డలు తక్కువగా వచ్చాయి.

మరో దుకాణానికి వెళ్లి ఆశీర్వాద్‌ గోధుమ పిండి ప్యాకెట్‌ తీసుకొని తూకం వేయగా కాంటాలో 80 గ్రాములు అధికంగా చూపించింది. ఇవీ కొందరు వ్యాపారుల మాయజాలానికి నిదర్శనం.

తూకాల్లో.. తేడాలు!1
1/3

తూకాల్లో.. తేడాలు!

తూకాల్లో.. తేడాలు!2
2/3

తూకాల్లో.. తేడాలు!

తూకాల్లో.. తేడాలు!3
3/3

తూకాల్లో.. తేడాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement