హోలి.. కావాలి ఆనందాల కేళి | - | Sakshi
Sakshi News home page

హోలి.. కావాలి ఆనందాల కేళి

Mar 14 2025 1:13 AM | Updated on Mar 14 2025 1:10 AM

రామగిరి(నల్లగొండ): హోలి పండుగ అనగానే అందరిలో ఉత్సాహం వస్తుంది. చిన్న నుంచి పెద్దల వరకు హుషారుగా రంగులు చల్లుకుంటారు. హోలి పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదాలకు తావులేకుండా ఆనందాలు నిండుతాయి. రసాయన రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిలో లభించే పదార్ధాలతో తయారుచేసిన రంగులను వినియోగించితే మంచి జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనిక రంగుల్లో అల్యూమినియం బ్రొమైడ్‌, లెడ్‌ ఆకై ్సడ్‌, మెర్క్యూరీ సల్ఫైడ్‌, కాపర్‌ సల్ఫైడ్‌ వంటివి ఉంటాయని, వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఒకవేళ కంట్లో పడితే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

సహజ రంగులతో మేలు..

ప్రకృతిలో లభించే పువ్వులు, ఆకులతో రంగులను తయారు చేసుకుంటే శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మోదుగు పువ్వు, గోగు పువ్వులను నీటిలో మరిగించడంతో రంగు ద్రావణంగా మారుతుంది. ఇలాంటివి చల్లుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

జాగ్రత్తలు తప్పనిసరి

హోలి పండుగ రోజు రంగులు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే వారు వాటిని తీసి హోలి ఆడాలి. కంట్లో రంగులు పడకుండా అద్దాలు వాడాలి. లూబ్రికేటింగ్‌ ఐ డ్రాప్స్‌ వాడాలి. ఒకవేళ కంట్లో రంగులు పడితే చల్లని నీటితో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కళ్లలో మంటగా అనిపిస్తే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి.

– డాక్టర్‌ తాటిపల్లి ప్రనూషరితేష్‌,

కంటి వైద్యురాలు

మాయిశ్చరైజర్‌ రుద్దుకోవాలి

హోలి ఆడటానికి ముందు చర్మానికి మాయిశ్చరైజర్‌ వాడాలి. తద్వారా రసాయన రంగులు శరీరానికి అంటుకోవు. చర్మం మొత్తం కప్పిఉండేలా దుస్తులు ధరించాలి. పెదవులు, కళ్ల చుట్టూ పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఆర్గానిక్‌ రంగులు వాడితే ఉత్తమం. హోలి పూర్తయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మంపై ఇరిటేషన్‌ అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

– సీహెచ్‌. వెంకటకృష్ణ, చర్మవ్యాధి వైద్యుడు

ఫ కళ్లలో, చర్మంపై రంగులు పడకుండా జాగ్రత్తలు వహించాలి

ఫ రసాయనిక రంగులతో ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్య నిపుణులు

ఫ సహజమైన రంగులు

వాడితే మేలు అని సూచన

హోలి.. కావాలి ఆనందాల కేళి1
1/2

హోలి.. కావాలి ఆనందాల కేళి

హోలి.. కావాలి ఆనందాల కేళి2
2/2

హోలి.. కావాలి ఆనందాల కేళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement