తిరుమలగిరి(నాగార్జునసాగర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులు సోమవారం విడుదల చేయగా.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన మందడి నాగార్జునరెడ్డి, అల్లి కీర్తన ఉద్యోగాలకు అర్హత సాధించారు. మందడి నాగార్జునరెడ్డి 2006 డీఎస్సీలో ఎస్‌జీటీగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2011లో అసిస్టెంట్ ట్రైబేల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికై కొద్దికాలం పనిచేసిన తర్వాత అదే ఏడాదిలో విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ తహసీల్దార్‌గా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యి 488 మార్కులతో అర్హత సాధించారు.
మొదటి ప్రయత్నంలోనే విజయం..
బోయగూడెం గ్రామానికే చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు దంపతుల కుమార్తె అల్లి కీర్తన మొదటి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–4 ఫలితాల్లో ఆమె జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై ంది. గ్రూప్–1 ఉద్యోగానికి 468.5 మార్కులతో అర్హత సాధించింది.
గుండెపురి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న భూక్య సందీప్ 468.5 మార్కులతో గ్రూప్–1కు అర్హత సాధించారు.
గ్రూప్–1 ఉద్యోగాలకు ముగ్గురు అర్హత
గ్రూప్–1 ఉద్యోగాలకు ముగ్గురు అర్హత