సూర్యాపేట: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ప్రవర్తన, నడవడికను గమనిస్తూ.. తప్పడగులు వేస్తున్నారని తెలిస్తే దండించకుండా ఏది చేడు, ఏది మంచి అనే విషయాన్ని వారు గ్రహించే విధంగా అవగాహన కల్పించాలి. వివిధ రంగాల్లో విజయం సాధించిన వారి గూర్చి పిల్లలకు వివరించాలి. పిల్లలతో స్నేహంగా మెలగాలి, పిల్లల సెల్‌ఫోన్‌ను గమనిస్తూ ఉండాలి. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే అంశాలకు దూరంగా ఉంచాలి. పిల్లలు ఎప్పుడు బిజీగా ఉండే విధంగా చదువుతో పాటు వ్యాయామం, డ్యాన్స్, చిత్రలేఖనం వంటి వాటిని నేర్పించాలి.
– బొల్లెద్దు వెంకటరత్నం, న్యాయవాది