నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో నివాసం ఉంటున్న సీనియర్ జనశక్తి రాష్ట్ర నాయకుడు చీటూరి సోమయ్య(85) అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన స్వగ్రామం జనగాం జిల్లా దేవరుప్పల మండలం ధర్మాపురం. సీపీఐఎంఎల్ జనశక్తి పార్టీలో సోమయ్య క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మృతదేహనికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అరుణోదయ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్, టీపీసీసీ నేత దైద రవీందర్, బీసీపీ జిల్లా కార్యదర్శి గాజుల సుకన్య, ట్రస్మా రాష్ట్ర నేత కందాల పాపిరెడ్డి, జనశక్తి నేత కోమరయ్య, న్యూడెమోక్రసీ నేతలు ఇందురు సాగర్, అంబటి చిరంజీవి తదితరులున్నారు.
జనశక్తి సీనియర్ నేత కన్నుమూత