మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకం
కథనాలు పరిశీలిస్తూ..
సూచనలు చేస్తూ..
మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక పేజీలు, కథనాలను జడ్జి బి.దీప్తి పరిశీలించారు. మహిళలపై ప్రత్యేకంగా రూపొందించిన కథనాలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం కోసం మహిళలు పోరాడిన కథనాలను ప్రశంసించారు. పత్రికలు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా.. చైతన్యం కలిగించే కథనాలు అందించాలన్నారు. బాధిత మహిళలకు అండగా ఉండాలని సూచించారు.
న్యాయ సహాయం అందిస్తాం..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని జడ్జి దీప్తి తెలిపారు. అందరికీ సమాన న్యాయం దక్కాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు. న్యాయపరంగా వెనుకబడిన వారికి అండగా న్యాయ సేవాధికార సంస్థ చేయూతనిస్తోందని.. ఇప్పటికే అనేక న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చామన్నారు. ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి సత్వర న్యాయం అందేలా సహకరిస్తామన్నారు. న్యాయ సహాయం పొందాలనుకునే వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాని సూచించారు.
బాధిత మహిళలకు అండగా ఉండాలి
న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి బి.దీప్తి
వివక్షను రూపుమాపితేనే అద్భుత సమాజం
మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా విధులు
రామగిరి(నల్లగొండ) : సమాజంలో కొన్నిచోట్ల ఇంకా లింగ వివక్ష కనిపిస్తోందని అది అంతరించాలని నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి పేర్కొన్నారు. మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకమ న్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూని ట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి పలు సూచనలు చేశారు.
సమాన అవకాశాలు ఉండాలి
మహిళలు సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడాలని జడ్జి దీప్తి సూచించారు. మహిళా సాధికారత జరిగినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగిపోతాయన్నారు. మహిళలను తక్కువ చేసి చూడకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పిస్తే వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలగుతారని పేర్కొన్నారు. బాధ్యతల విషయంలో మహిళలను వేరు చేసి చూడొద్దన్నారు. ఉద్యోగం చేసే మహిళలను కొందరు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావని అడుగుతారని.. అదే ప్రశ్న మగవారిని మాత్రం అడగరని ఇది సరి కాదన్నారు. సమాజంలో వివక్షను రూపుమాపితేనే మహిళలు స్వేచ్ఛాయుత ప్రయాణానికి అడుగులు పడతాయన్నారు. సమాజంలో అంతరాలు రూపుమాపితేనే అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు.
అసమానతలు అంతరించాలి