నల్లగొండ : మహిళా రక్షణకు షీటీమ్స్ అండగా నిలబడుతున్నాయి. మహిళలకు తెలియకుండానే వారికి భద్రత కల్పిస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో షీటీమ్ పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తూ బాలికలు, మహిళలను వేధించేవారి అటకట్టిస్తున్నాయని చెబుతున్నారు నల్లగొండ షీటీమ్ సీఐ కోట కరుణాకర్. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం జిల్లాలో షీటీమ్‌లను ఏర్పాటు చేసింది. అమ్మాయిలను ఎవరైనా వెంబడించినా, బెదిరించినా, వేధించినా షీటీమ్ పోలీసులకు లేదా 100 నంబర్‌కు కాల్ చేయాలి. వెంటనే పోలీసులు వచ్చి వారిని పట్టుకుంటారు. పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. అంతేకాదు టీ సేవ్ యాప్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. ఆటో ఎక్కిన వెంటనే సదరు మహిళ ఆటోనెంబర్‌ను ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే యాప్‌లో ఎమర్జెన్సీ బటన్ నొక్కితే ఆ ఏరియా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం వెళ్లి వెంటనే ఆ పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ప్రస్తుతం నల్లగొండ, మిర్యాలగూడలోనే మహిళా పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వాటిని కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అమ్మాయిలను వేధించే 103 మందిని షీటీమ్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేశాయి. 149 మందిపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. 7 కేసులు ఎఫ్‌ఐఆర్ అయ్యాయి. 88 మందిపై పిట్టీ కేసులు నమోదయ్యాయి. షీటీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలకు 485 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం.
షీటీమ్స్‌తో .. ఆమెకు భరోసా
షీటీమ్స్‌తో .. ఆమెకు భరోసా