ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : జిల్లాలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి మండలానికి ఇసుక రీచ్‌లను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత మండల అధికారి జారీ చేసిన అనుమతి పత్రంతో మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు.
నేడు మంత్రుల రాక
నల్లగొండ : జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు శనివారం నల్లగొండకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రులు కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ ఉమ్మడి జిల్లా ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.