
ముగిసిన నెల్లిబండ గట్టు జాతర
నకిరేకల్: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని గట్టుపై రెండు రోజులుగా కొనసాగుతున్న శ్రీలింగమంతుల స్వామి–సౌడమ్మ జాతర మంగళవారం రాత్రి ముగిసింది. సాయంత్రం 4:30 గంటలకు పసుపు కుంకుమలతో దేవుని పటం (చంద్రపట్నం) వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతరతో నెల్లిబండ గ్రామమంతా పండుగ వాతావరణం సందడి నెలకొంది. చివరి రోజు పూజల్లో ఆలయ చైర్మన్ యానాల యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ బోయిళ్ల కిషోర్, డెరెక్టర్లు బాత్క లింగస్వామి, ఆడెపు సతీష్, బోయిళ్ల అశ్విన్, గుడుగుంట్ల శివశంకర్, వీరబోయిన అబ్బయ్యల పాల్గొన్నారు.