
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్ హరిచందన, పక్కన ఎస్పీ చందనాదీప్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి నల్లగొండ కలెక్టరేట్‌లోని ఆర్‌వో కార్యాలయంలో ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి అభ్యర్థి ఫారం–2ఎ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేయవచ్చు. వాటిని అభ్యర్థి లేదా అభ్యర్థి తరపున మరెవరైనా దాఖలు చేయవచ్చు. ప్రతి అభ్యర్థి తనపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి ఫారం–26ను దాఖలు చేయాలి. పోటీ చేసే అభ్యర్థి అదే నియోజకవర్గానికి చెందినవారు కాకపోతే తాను ఏ నియోజకవర్గంలో ఓటరో దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీని సంబంధిత ఆర్‌వో నుంచి తీసుకొచ్చి దాఖలు చేయాలి. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించి వివరాల కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలి.
పెరిగిన యువ ఓటర్లు
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో గతంలో 18 –19 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్లు 50 వేల వరకు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 60,116కు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీనియర్ సిటిజన్ ఓటర్లుగా 80 ఏళ్లు దాటిన వారిని పరిగణనలోకి తీసుకోగా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 85 ఏళ్ల వయసు దాటిన వారిని సీనియర్ సిటిజన్ ఓటర్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం నల్లగొండ పరిధిలో అలాంటి వారు 9,587 మంది ఉన్నట్లు గుర్తించారు. శారీరక వైకల్యం కలిగిన ఓటర్లు 33,865 మంది ఉండగా, ఓవర్సీస్ (ఎన్‌ఆర్‌ఐ) ఓటర్లు 180 మంది ఉన్నారు.
403 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
ఈ నియోజకవర్గ పరిధిలోని 1436 ప్రాంతాల్లో 2061 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 505, గ్రామీణ ప్రాంతాల్లో 1556 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటిల్లో 403 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
100 మీటర్ల
వరకే అనుమతి
నామినేషన్ల స్వీకరణ సందర్భంగా 100 మీటర్ల పరిధిలో ఇతరులకు అనుమతి ఉండదని ఆర్‌వో దాసరి హరిచందన పేర్కొన్నారు. అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అన్ని బృందాలు, నోడల్ ఆధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు సువిధ యాప్ ద్వారా, లేదంటే ఏఆర్‌వో కార్యాలయాల్లో అనుమతులు తీసుకోవాలన్నారు.
ఎనిమిది చెక్‌పోస్టులు : ఎస్పీ చందనాదీప్తి
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మూడు అంతర్రాష్ట్ర, 5 అంతర్ జిల్లా చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. వాడపల్లి, నాగార్జునసాగర్, అడవిదేవులపల్లి చెక్ పోస్టులవద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 184 కేసుల్లో రూ.9.18 కోట్ల విలువైన నగదు ఆభరణాలు సీజ్ చేశామన్నారు.
ఫ పార్లమెంట్ ఎన్నికలకు గురువారం వెలువడనున్న నోటిఫికేషన్
ఫ ఉదయం 11 గంటల నుంచి
మధ్యాహ్నం 3 గంటలవరకు
నామినేషన్ల స్వీకరణ
ఫ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేలా ఏర్పాట్లు
ఫ ఏఆర్‌వో కార్యాలయాల్లోనూ
అందుబాటులో నామినేషన్ ఫారాలు
ఫ నామినేషన్ల దాఖలుకు
25వ తేదీ చివరి గడువు
ఫ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో 17.22 లక్షల మంది ఓటర్లు
నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి చేశాం
ఫ కలెక్టర్ దాసరి హరిచందన
18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ప్రభుత్వ పని దినాల్లోనే నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని ఏఆర్‌వో కేంద్రాల్లో నామినేషన్ ఫారాలను అందుబాటులో ఉంచామని, ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సగటున కనిష్టంగా 836 మంది, గరిష్టంగా 1029 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న 43 ప్రాంతాల్లో యాక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో పోలింగ్ కేంద్రాలున్న 20 భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఆ కేంద్రాలను మార్పు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌లు, తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్, టాయ్‌లెట్స్, వైద్య సదుపాయాలు, రవాణ సదుపాయాలు కల్పి స్తున్నట్లు వివరించారు. పార్లమెంట్ పరిధిలో 17.22 లక్షల మంది ఓటర్లు ఉండగా, 736 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు.
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల సంఖ్య
అసెంబ్లీ నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ట్రాన్స్‌జెండర్లు మొత్తం
దేవరకొండ(ఎస్టీ) 131659 130392 18 262069
నాగార్జునసాగర్ 115710 120464 21 236195
మిర్యాలగూడ 115543 120299 26 235868
హుజూర్‌నగర్ 121667 129164 17 250848
కోదాడ 119068 125878 18 244964
సూర్యాపేట 118770 124893 13 243676
నల్లగొండ 121079 127766 56 248901
మొత్తం 843496 878856 169 1722521