
సూచనలిస్తున్న డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు
నల్లగొండ: నేషనల్ మీన్స్‌కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్‌ఈ)–2023 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ బి.భిక్షపతి తెలిపారు. నల్లగొండతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగిన ఈ పరీక్షకు 1,272 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1,217 మంది హాజరయ్యారని, 55 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నల్లగొండలోని 5 కేంద్రాల్లో పరీక్ష జరిగిందని తెలిపారు.
నేడు దర్వేశిపురంలో వేలం పాటలు
కనగల్: మండల పరిధిలోని దర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఏడాది కాలానికి గాను వివిధ వస్తువుల విక్రయ హక్కులను కల్పించుటకు సోమవారం టెండర్ కం బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అల్గుబెల్లి నర్సింహారెడ్డి, ఈఓ జల్లేపల్లి జయరామయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయలు అమ్ముకొను హక్కుకు గాను రూ.10లక్షల డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. గాజుల అమ్మకానికి రూ.50వేలు, చీరలు, ఒడిబియ్యం సేకరించు హక్కుకు రూ.50వేలు, కిరాణం, మానియర్ షాపు రూ.50వేలు, పూలు, పండ్లు అమ్ముకొను హక్కుకు రూ.2లక్షలు, లడ్డూ, పులిహోర ప్రసాదాలు అమ్ముకొను హక్కులకు రూ.లక్ష డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏదైన జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి మధ్యాహ్నం 1గంటకు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్‌లో షీల్డు టెండర్‌తో పాటు డీడీని జతపరిచి వేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, పాలకమండలి సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
బుద్ధవనం.. అద్భుతం
నాగార్జునసాగర్: బుద్ధవనం నిర్మాణం అద్భుతంగా ఉందని అమెరికా దేశంలో ఉంటున్న బౌద్ధ పరిశోధకులు భాస్కర్, తలాటం శ్రీనగేశ్ అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్ తీరాన గల బుద్ధవనాన్ని వారు సందర్శించారు. బౌద్ధవారసత్వ థీమ్ పార్కులోని బుద్ధ చరిత వనం జాతకవనం, స్థూపవనం,బుద్ధుని శిల్పం, ఆచార్యనాగార్జుని శిల్పం, మహాస్థూపం చు ట్టూ అలంకరించిన బౌద్ధ శిల్పాల గురించి బుద్ధవన బుద్ధిస్ట్ ఎక్స్‌ఫర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని నాగిరెడ్డి విరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జునకొండకు వచ్చే బౌద్ధ పర్యాటకులకు బుద్ధవనం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నదని బౌద్ధ పరిశోధకులు తెలిపారు. ప్రధానంగా విజయవిహార్‌లో ఏర్పాటు చేసిన నడిచే బుద్ధుని విగ్రహం ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
కనగల్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొండల్‌రావు అన్నారు. ఆదివారం కనగల్‌లోని రైతు వేదికలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి సూచనలిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, డీఎంఓ దుర్గయ్య, పీహెచ్‌సీ డాక్టర్ వరూధిని, సర్పంచ్ నర్సింగ్ సునీత కృష్ణయ్యగౌడ్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భువనగిరి ఖిలాకు
సందర్శకుల తాకిడి
భువనగిరి: జిల్లా కేంద్రంలోని ఖిలాపై సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖిలాపై కట్టడాలను, రాజప్రసాదాలను, నీటి కొలనులను తిలకించారు. అనంతరం రాక్ కై ్లంబింగ్ శిక్షణ స్కూల్ ఆధ్వర్యంలో ఖిలాపై ర్యాప్లింగ్ నిర్వహించారు.
శిల్పం గురించి వివరిస్తున్న శివనాగిరెడ్డి

ఖిలాపై ర్యాప్లింగ్ చేస్తున్న సందర్శకులు