కొల్లాపూర్: శ్రీశైలం బ్యాక్‌వాటర్ వేగంగా తగ్గుతుండడంతో నది నీటిలో మునిగిపోయిన సంగమేశ్వర ఆలయ గోపురం తేలింది. అయితే మళ్లీ కృష్ణానదికి వరదలు పోటెత్తి, ఆలయం ఇంకా కొన్ని నెలలపాటు నీటిలో మునిగి ఉంటేనే తెలుగు రాష్ట్రాలకు మంచిదనే సంకల్పంతో ఆలయ గోపురంపై వినాయకుడు, శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలకు అర్చకులు రఘురామశర్మ పూజలు నిర్వహించారు. కృష్ణానదికి వరదలు వచ్చి ఆలయ గోపురం, వినాయక విగ్రహం నది నీటిలో మునగాలని భగవంతున్ని కోరినట్లు తెలిపారు. శ్రీశైలం డ్యాంలో మరో ఆరు నెలలపాటు నీళ్లు నిండుగా ఉంటేనే ఇరు రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బందులుండవని వివరించారు.


