కందనూలు: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సోమవారం 60 కేంద్రాల్లో నిర్వహించిన సాంఘికశాస్త్రం పరీక్షకు 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరు కాగా.. 21మంది గైర్హాజరయ్యారు. 99.80 శాతం హాజరు నమోదైందని డీఈఓ రమేశ్‌కుమార్ తెలిపారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన పోలీసు, వైద్యారోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులకు డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు.


