ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్‌లో మరమ్మతు చేపట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్‌లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు..
పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్‌లో నీరు ఉన్నప్పుడు, రైతులు సాగులో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దాని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి.
– వడ్డే స్వాములు,
రైతు, జిల్లేడుదిన్నె


