ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

వెల్దండ: ఉపాధిహామీ పథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి చిన్న ఓబులేష్‌ అన్నారు. సోమవారం వెల్దండ మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధిహామీ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 100మందికి పైగా కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం 7గంటలకే పనులకు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో కూలీల మస్టర్‌ నమోదు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. సమావేశంలో ఎంపీడీఓ కృష్ణయ్య, ఏపీఓ ఈశ్వర్‌జీ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement