కాస్త మెరుగు.. | - | Sakshi
Sakshi News home page

కాస్త మెరుగు..

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

ఒకేషనల్‌లో 68.37 శాతం..

జిల్లాలో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 68.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం జిల్లాలో ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,372 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 938 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ప్రథమ సంవత్సరానికి సంబంధించి 1,536 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 870 మంది (56.64 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

గురుకులాలు.. కేజీబీవీల్లో

జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీల విద్యార్థులు ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభకనబరిచారు. కల్వకుర్తి గురుకుల బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఎంపీసీ విభాగంలో శ్రీనిధి 994/1000 మార్కులు, బైపీసీ విభాగంలో అఖిల 991 మార్కులు, సీఈసీ విభాగంలో శ్రీజ 979 మార్కులు, ఎంఈసి విభాగంలో 966 మార్కులు సాధించారు. అలాగే కొల్లాపూర్‌ కేజీబీవీ ఎంపీసీ విభాగంలో అనూష 983 మార్కులు, చారకొండ కేజీబీవీ బైపీసీ విభాగంలో లావణ్య 986 మార్కులు, బిజినేపల్లి కేజీబీవీ సీఈసీ విభాగంలో పుష్ప 952 మార్కులు సాధించారు.

కందనూలు: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా స్థానం కాస్త మెరుగుపడంది. ఆదివారం ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జిల్లా 28వ స్థానంలో నిలిచింది. గతేడాది 31వ స్థానంలో నిలవగా ఈసారి మూడు స్థానాలు ఎగబాకింది. ఇక మొదటి సంవత్సరం ఫలితాల్లో గతేడాది 34వ స్థానంలో నిలవగా.. ఈసారి 27వ స్థానానికి పెరిగింది. మొత్తంగా ఈ సంవత్సరం జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 4,500 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,982 మంది (66.27 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 830 మంది, బాలికలు 2,152 మంది ఉన్నారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 5,353 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,987 మంది (55.80 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 784 మంది, బాలికలు 2,203 మంది ఉన్నారు. అయితే ఫస్టియర్‌, సెకండియర్‌లోనూ బాలుర కంటే బాలికలే అత్యధిక మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఇంటర్‌ ఉత్తీర్ణత

ప్రథమ సంవత్సరంలో 27.. ద్వితీయ సంవత్సరంలో 28వ స్థానం

అత్యధిక ఉత్తీర్ణతతో

సత్తాచాటిన బాలికలు

Advertisement
 
Advertisement
Advertisement