సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె

Apr 10 2026 11:03 AM | Updated on Apr 10 2026 11:03 AM

కందనూలు: విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తేల్చిచెప్పింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ డివిజనల్‌ కార్యాలయం వద్ద ఆర్టిజన్‌ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసి నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్‌శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్‌శాఖ యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ ఇచ్చి పలు దఫాలుగా ధర్నాలు, నిరసనలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే సమ్మెలోకి దిగడం జరిగిందన్నారు. ఆర్టిజన్‌ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయడంతో పాటు విద్యార్హతల ఆధారంగా రెగ్యులర్‌ పోస్టుల్లో కన్వర్షన్‌ చేయాలని, పీస్‌రేట్‌ కార్మికులకు జీఓ నం.11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్టిజన్‌ కార్మికుల సమ్మెకు పలు యూనియన్లు మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో టీజీఎస్‌పీడీసీఎల్‌ జేఏసీ సహాయ కార్యదర్శులు దశరథం, సైదులు, ఉమ్మడి జిల్లా కోచైర్మన్‌ రాజ్‌కుమార్‌, కోకన్వీనర్‌ లోకేశ్వర్‌, డివిజన్‌ జేఏసీ చైర్మన్‌ మిద్దె శ్రీనివాసులు, కన్వీనర్లు జయకర్‌, మల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement