జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,968, కనిష్టంగా రూ.5,666 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,226, కనిష్టంగా రూ.6,100, ఆముదాలు గరిష్టంగా రూ.6,370, కనిష్టంగా రూ.6,048, జొన్నలు గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,297, చింతగింజలు రూ.2,676, ఉలువలు రూ.4,101, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,892, కనిష్టంగా రూ.1,650 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


