హోంగార్డులు అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

హోంగార్డులు అంకితభావంతో పనిచేయాలి

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్లందరూ తమ విధులు అంకితభావంతో నిర్వహిస్తూ.. ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు ఆఫీసర్లందరూ ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని, వెల్ఫేర్‌ బెనిఫిట్స్‌ కోసం వెల్ఫేర్‌ అమౌంట్‌ను రూ.20 నుంచి రూ.200 వరకు పెంచుకోవాలని సూచించారు. హోంగార్డులందరికీ ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాఘవరావు, ఆర్‌ఎస్‌ఐ, గౌస్‌ పాష, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్‌నారాయణ, జిల్లా హోంగార్డు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జంబులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement