కొల్లాపూర్: సామాజిక న్యాయపోరాట యోధుడు బాబు జగ్జీవన్‌రాం అని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో ఆయన జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడు జగ్జీవన్‌రాం అని అన్నారు. ఆయన ఒక వర్గానికో, కులానికో నాయకుడు కాదని.. అంటరానితనం, కులవివక్షపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం అందించారని అన్నారు. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో రక్షణమంత్రిగా ఆయన ప్రదర్శించిన వ్యూహ చతురత ఎంతో గొప్పదని.. కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, బోనస్‌కు శ్రీకారం చుట్టిన నాయకుడు జగ్జీవన్‌రాం అని.. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి జూపల్లి అన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


