
దరఖాస్తుదారులకు ఇబ్బందులు రానివ్వొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఆయన పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. జిల్లాలోని నాగర్‌కర్నూల్, తెలకపల్లి, కొల్లాపూర్, కల్వకుర్తి ఎకై ్సజ్ స్టేషన్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేసి.. మద్యం దుకాణాల దరఖాస్తులకు సంబంధించి వ్యాపారులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 67 దుకాణాలకు గురువారం ఒక్కరోజే 10 దరఖాస్తులు వచ్చాయని.. ఇప్పటి వరకు మొత్తం 51 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వెంట ఈఎస్ గాయత్రి, సిబ్బంది ఉన్నారు.