
పరిశోధనలకు పట్టం
●
పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్‌కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్‌మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్‌కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
‘మన్నె’కు గౌరవ డాక్టరేట్..
పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్‌ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు.
పీహెచ్‌డీ పట్టా పొందనున్న వారి వివరాలిలా..
పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్
స్నాతకోత్సవంలో 12 మందికి డాక్టరేట్లు
పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్
గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు
స్కాలర్: రాజశ్రీనాథ్ (మైక్రోబయాలజీ)
పరిశోధన అంశం: స్టడీ ఆన్ మైక్రోబియాల్ లిపస్ అండ్ ప్రొటెస్ కల్టివబుల్ అండ్ మెటాజినీవబుల్ అప్రొచ్
స్కాలర్: శ్రీనివాసరావు మేకల (మైక్రోబయాలజీ)
పరిశోధన అంశం: అల్లివేషన్ ఆఫ్ డ్రోట్ స్ట్రెస్ ఇన్ క్యాప్సియం అనం ఎల్.అండ్ సౌఫోసిస్ టెట్రాగోనాలోబా బై యూసింగ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా
స్కాలర్: విజయ్‌కుమార్ (మైక్రోబయాలజీ)
పరిశోధన అంశం : బయోరిమేడేషన్ స్టడీస్ ఆన్ ఫిజికో–కెమికల్ ఆన్ మైక్రోబయాలాజికల్ అలాలసిస్ ఆఫ్ వాటర్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ పెద్ద చెరువు, మహబూబ్‌నగర్
స్కాలర్: చేతన (మైక్రోబయాలజీ)
పరిశోధన అంశం: ప్రొడెక్షన్ ఆఫ్ పెక్టెనసిస్ ఫ్రం ఆస్‌పర్ గిల్లాస్ నిజర్ ఫర్ ప్రూట్ జ్యూస్ క్లారిఫికేషన్ రైపింగ్ అండ్ పీలింగ్ డీగ్రేడేషన్
స్కాలర్: సంజీవ్‌కుమార్ (మైక్రోబయాలజీ)
పరిశోధన అంశం : ఫార్మలేషన్ ఆండ్ ఎలివేషన్ ఆఫ్ పాలీబయోన్యూక్లోప్లాంట్ అన్ సెలెక్టెడ్ క్రాప్ ప్లాంట్స్
స్కాలర్: కె.సంధ్య (కెమిస్ట్రీ)
పరిశోధన అంశం : ఎన్విరార్‌మెంటల్లీ బిగిన్స్ బయోసింథసిస్ ఆన్ పెల్లాడియం నానోపార్టికల్స్ ఆన్ ఇట్స్ యూస్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ రెమిడేషన్ ఆన్ బయోమెడికల్ అప్లికేషన్
స్కాలర్: డి.వెంకటేష్ (కెమిస్ట్రీ)
పరిశోధన అంశం: ిసంధసిస్ క్యారెక్టరైజేషన్ ఫొటో క్యాటలిటిక్ ఆరండ్ ఫోరోమెటిక్ సెన్సింగ్ స్టడీస్ ఆప్ జి–సీ3ఎన్4 సపోర్టెడ్ మెటల్ ఆకై ్సడ్ నానోపార్టికల్స్
స్కాలర్: రుకియాభాను (కెమిస్ట్రీ)
పరిశోధన అంశం: గ్రీన్ సింధసిస్ ఆఫ్ గోల్డ్ పెల్లాడియం ఆన్ సిల్వర్ నానోపార్టికల్స్ యూజింగ్ ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్
స్కాలర్: టి.స్వాతి (కెమిస్ట్రీ)
పరిశోధన అంశం: ప్రిపరేషన్ స్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్ ఆప్ ట్రాన్సినిట్ స్పీసెస్ ఆఫ్ డీమ్యాప్ ఆండ్ సింధసిస్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ స్కాఫోల్డ్స్ బై ఎంప్లయింగ్ ఆక్వోయిస్ ఫేస్ క్నొవేంగిల్ కండేంషేషన్ అండ్ మాల్టీకాంపోనెంట్ రియాక్షన్
స్కాలర్: జి.విజయలక్ష్మీ (కెమిస్ట్రీ)
పరిశోధన అంశం: ఆక్వియాస్ ఫేస్ గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంప్లయింగ్ లివేస్ బేస్ అడెక్ట్ ఆప్ డీమ్యాప్ యాజ్ న్యూగ్రీన్ రీఏజెంట్స్ ఆన్ స్టీరియో స్పెసిఫిక్ సింధసిస్ ఆఫ్ మెడిసినల్లీ యాక్టిక్ 1,8–న్యాప్తిరిడైన్ డిప్రివేటివ్
స్కాలర్: ఎంఆర్.సంధ్యారాణి (బిజినెస్
మేనేజ్‌మెంట్)
పరిశోధన అంశం: ఏ స్టడీ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్ ఆన్ ఎంప్లయిస్ రీటెన్షన్
విత్ రిఫరెన్స్ టూ సెలెక్ట్ ఇట్ కంపెనీస్
ఇన్ హైదరాబాద్
స్కాలర్: రితిక బజాజ్ (కామర్స్)
పరిశోధన అంశం: పర్ఫామెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఏ స్టడీ ఆఫ్ సెలెక్ట్ బస్ డిపోట్స్ ఇన్ హైదరాబాద్

పరిశోధనలకు పట్టం