
బీజేపీ హయాంలో దళితులపై పెరిగిన దాడులు
కల్వకుర్తి టౌన్: బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే దళితులపై దాడులు పెరిగాయని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిపై ప్రజలందరూ స్పందించారని.. కానీ ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. హర్యానాలో ఐపీఎస్ ఆత్మహత్యకు పాల్ప డిన ఘటనపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐసీఎస్‌లలో ఉన్న దళితులకు కనీస విలువ లే కుండా పోయిందన్నారు. దళితులకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెసేనని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే సీజేఐపై జరిగిన దాడి, హర్యానాలో ఐపీఎస్ ఆత్మహత్య ఘటనలపై చర్చ కు నోటీసు అందిస్తానని.. దళితులపై జరుగుతున్న దాడులపై చర్చిస్తామన్నారు. దళితులపై దాడులను అరికట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.