తీరనున్న వెతలు.. | - | Sakshi
Sakshi News home page

తీరనున్న వెతలు..

Oct 12 2025 7:53 AM | Updated on Oct 12 2025 7:53 AM

తీరను

తీరనున్న వెతలు..

రైతులకు మేలు..

236 కేంద్రాల ఏర్పాటు..

కొనుగోలు కేంద్రాలకు అధునాతన పరికరాలు

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రెండు పాడీ డ్రయ్యర్లు రానున్నాయి. ఇందుకు ఇప్పటికే డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. ఆటోమెటిక్‌ పాడీ క్లీనర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌తో రైతులకు వాతావరణ హెచ్చరికలు ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది.

– రాజేందర్‌, సివిల్‌ సప్లై డీఎం

నాగర్‌కర్నూల్‌: వానాకాలం, యాసంగిలో రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని, శుభ్రంగా లేదనే కారణాలతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు అకస్మాత్తుగా కురిసే వర్షాలపై రైతులకు సమాచారం సైతం లేకపోవడంతో ధాన్యం నీటిపాలై నష్టం వాటిల్లుతుంది. వీటిన్నింటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆటోమెటిక్‌ పాడీ క్లీనర్లతో పాటు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు డ్రయ్యర్లు రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. వాతావరణ హెచ్చరికలను తెలిపేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వీటితో రైతులకు మేలు చేకూరనుంది.

జిల్లాకు రెండు డ్రయ్యర్లు..

జిల్లావ్యాపంగా ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో 56 పాడీ క్లీనర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రస్తుతం 50 క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రెండు మొబైల్‌ పాడీ డ్రయ్యర్లను ఈ సారి కొత్తగా తీసుకురానున్నారు. ఒక్కో డ్రయ్యర్‌ను రూ. 14లక్షలతో కొనుగోలు చేయగా.. కొనుగోలు కేంద్రాల ప్రారంభం నాటికి అందుబాటులోకి రానున్నాయి. నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మార్కెట్‌ యార్డుల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేయనుండగా.. అవసరం మేరకు ఇతర కొనుగోలు కేంద్రాలకు పంపనున్నారు. ఇక ధాన్యం సేకరణ సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు చేసేందుకు ఆక్యూ వెదర్‌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో రోజు 5:30 గంటలకు సమాచారం రానుంది. ఈ సమాచారాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు తెలియజేయనున్నారు. దీంతో రైతులు ధాన్యం తడవకుండా ముందుజాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

జిల్లాకు కొత్తగా రెండు మొబైల్‌ పాడీ డ్రయ్యర్లు

ఇప్పటికే 50 పాడీ క్లీనర్లు అందుబాటులో

ప్రత్యేక యాప్‌ ద్వారా వాతావరణ

సమాచారం

జిల్లాలో 2.54లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు గాను 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 103, పీఏసీఎస్‌ 129, మెప్మా ఆధ్వర్యంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గత వానాకాలంలో 2.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా ఉండగా.. 1.84లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు.

తీరనున్న వెతలు.. 1
1/1

తీరనున్న వెతలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement