
ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ
చిత్తు చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. అంటూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని మాట్లాడారు. గౌరమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఇంటిలో సంతోషం, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి భార్య సరితతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే భార్య స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
– నాగర్‌కర్నూల్ / కందనూలు

ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ

ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ