
దసరాకు ముస్తాబవుతున్న కొండారెడ్డిపల్లి
వంగూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా దసరా రోజు సొంత గ్రామమైన వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి రానున్నారు. గతేడాది ముఖ్యమంత్రిగా మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన రేవంత్‌రెడ్డి గ్రామ పంచాయతీ భవనం, సోలార్ విద్యుత్ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గత నెల 28న రాష్ట్ర మంత్రులు కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. దసరా పండుగ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌లో స్వగ్రామానికి చేరుకోనున్నారు. దేవాలయంలో పూజల అనంతరం సాయంత్రం జమ్మికి వెళ్తారని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పెద్దఎత్తున పోలీసు యంత్రాంగం మోహరించారు. హెలీప్యాడ్ నుంచి దేవాలయం వరకు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామం మొత్తం ఫ్లెక్సీలు, పూల డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో కొత్త రోడ్లు, కొత్త భవనాలు నిర్మాణం కావడంతో గ్రామం రూపురేఖలు మారాయి. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రాకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాక నేపథ్యంలో
పకడ్బందీగా ఏర్పాట్లు