
అంకితభావంతో సేవలు..
గతంలో నిర్వహించిన విధులను తిరిగి నిర్వహించే అదృష్టం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు అవసరమైన సేవలను అంకిత భావంతో అందిస్తాం. ప్రజలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు వ్యయప్రయాసలతో వచ్చే పరిస్థితి ఉండదు. మాకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్జతలు. – ఎడ్ల శంకర్, జీపీఓ,
జూపల్లి, చారకొండ మండలం
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తిరిగి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తిరిగి మా విధులను మేము నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ,అధికారులకు రుణపడి ఉంటాం. శాయశక్తులా ప్రజలకు సేవలను పారదర్శకంగా అందిస్తాం. – ఎండీ సాదిక్, జీపీఓ,
జట్నారపల్లి, ఊరకొండ మండలం

అంకితభావంతో సేవలు..