ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

Sep 27 2025 7:11 AM | Updated on Sep 27 2025 7:11 AM

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

63.54 లక్షల గన్నీబ్యాగులు అవసరం..

ఏర్పాట్లు చేస్తున్నాం..

నాగర్‌కర్నూల్‌: వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో రోజురోజుకు వరిసాగు విస్తీర్ణం పెరుగుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు దిగుబడిని అంచనా వేసి.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది వానాకాలంలో వరిపంట అగ్గితెగులు బారినపడి పెద్దగా దిగుబడి రాలేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో చాలా చోట్ల వరి పొలాలు నీటమునగడంతో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉండటంతో అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

1.62లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లాలో వానాకాలం రికార్డు స్థాయిలో వరిపంట సాగైంది. మొత్తం 1,62,095 ఎకరాల్లో వరిసాగు కాగా.. 4,53,866 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 2,54,168 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

లక్ష్యానికి అనుగుణంగా..

జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు 2.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 103, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 129, మెప్మా ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది వానాకాలంలో 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రైతుల నుంచి 1.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. అయితే ప్రతి ఏటా కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగుల కొరత పెద్ద సమస్యగా మారింది. అధికారులు అవసరమైన గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని పెట్టాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం గతంలో ధాన్యాన్ని తరలించిన మిల్లుల వద్ద నుంచి గన్నీబ్యాగులు తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో 236 కేంద్రాల

ఏర్పాటుకు సన్నాహాలు

2.54లక్షల మెట్రిక్‌ టన్నుల

ధాన్యం సేకరణ లక్ష్యం

గన్నీబ్యాగుల కొరత లేకుండా చర్యలు

కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 63.54లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు అంచనా వేయగా.. ప్రస్తుతం 18.93లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా 49.61 లక్షల గన్నీబ్యాగులు దిగుమతి చేసుకోవాల్సి ఉంది.

వానాకాలం రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. పంట చేతికొచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.

– బాల్‌రాజు, సివిల్‌సప్లై డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement