
ముంచుతున్న ముసురు
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం
●
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో రెండు రోజులుగా ముసురు వాన కురుస్తోంది. శుక్రవారం సైతం నిరాటంకంగా వర్షం కురిసింది. అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 56.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, కోడేరు, తిమ్మాజిపేట మండలాల్లో 34 మి.మీ. మించి వర్షం కురిసింది. అధిక వర్షాలకు పంట పొలాలు నీటమునడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో పంటలు రంగు మారి దెబ్బతింటున్నాయని.. ఈ సారి దిగుబడి తగ్గుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. పంటలను రక్షించుకునేందుకు కష్టాలు పడుతున్నారు.
ఇప్పటికే 311 ఎకరాల్లో పంటనష్టం..
జిల్లాలోని నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, కల్వకుర్తి, కోడేరు, లింగాల, తెలకపల్లి మండలాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 311 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇంతకన్నా ఎక్కువ స్థాయిలో నష్టం జరిగిందని.. అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు చెబుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
కల్వకుర్తి 10.8
పలుచోట్ల నీటమునిగిన పంటలు
దిగుబడిపై తీవ్ర ప్రభావం
ఆందోళనలో రైతులు
పంటనష్టాన్ని అంచనా వేసి
ఆదుకోవాలని వేడుకోలు

ముంచుతున్న ముసురు