
నాలుగెకరాలు నీటమునిగింది..
గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వరద నీరంతా వరి పొలాన్ని ముంచెత్తింది. నాలుగెకరాల పంట నీటిలో మునిగిపోయింది. పత్తి, మొక్కజొన్న పంటలు సైతం దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నష్టపోయిన పంటలకు సకాలంలో పరిహారం అందించాలి.
– చెన్నయ్య,
రైతు, చేగుంట, తిమ్మాజిపేట మండలం
జిల్లాలోని మండలాల వారీగా వరి, పత్తి, మొక్కజొన్న పంటల నష్టం వివరాలు తీసుకున్నాం. ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయిలో పంటనష్టం విస్తీర్ణం, రైతుల వివరాలు సేకరించాం. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్టపరిహారం అందిస్తాం.
– యశ్వంత్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి