
ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ కృష్ణయ్య, సీఐ శంకర్, ఆర్‌ఐ జగన్, సీసీ బాలరాజు, ఆర్‌ఎస్‌ఐ గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.