ప్రజాపాలన దిశగా.. | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన దిశగా..

Sep 18 2025 8:12 AM | Updated on Sep 18 2025 8:12 AM

ప్రజాపాలన దిశగా..

ప్రజాపాలన దిశగా..

పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి..

నియంతృత్వం నుంచి
చారిత్రక ఘటనకు గుర్తుగా ప్రభుత్వ కార్యక్రమం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదలకు ఆత్మగౌరవం

వ్యవసాయం, విద్య,

వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ ప్రాజెక్టులను

పూర్తిచేసి పాలమూరును

సస్యశ్యామలం చేస్తాం

రాష్ట్ర ప్రణాళికా సంఘం

ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: దశాబ్ధాల తరబడి ఉద్యమాలు, పోరాటాల చరిత్ర తెలంగాణకు ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. నాటి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది.. ప్రజాస్వామ్య పాలన అవతరించిన చారిత్రక ఘటనకు గుర్తుగా నేటి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలనలో ప్రజలు భూస్వాముల వద్ద బానిసలుగా బతకాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం విముక్తి కలుగలేదన్నారు. ఆపరేషన్‌ కాటర్‌ పిల్లర్‌, ఆపరేషన్‌ పోలో పేరుతో భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానంపై పోరాటం చేసిన ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17న భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని తమ ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు.

కలెక్టరేట్‌ ప్రాంగణంలో జాతీయ జెండాను

ఆవిష్కరిస్తున్న

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, చిత్రంలో కలెక్టర్‌

బదావత్‌ సంతోష్‌,

ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ

జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించామని.. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులకు రూ. 7వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 311.644 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని వివరించారు. కేఎల్‌ఐకి అనుసంధానంగా పులిజాల నుంచి చంద్రసాగర్‌ చెరువు వరకు 15 కి.మీ. బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణం కోసం రూ. 107.20 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్టేజ్‌–1 కింద తెలకపల్లి, ఉప్పునుంతల, లింగాల, బల్మూర్‌, అచ్చంపేట మండలాల్లో 57,200 ఎకరాలకు నీరందించేందుకు రూ. 1,534 కోట్ల అంచనాలతో పరిపాలనా అనుమతులు పొందినట్టు వివరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. కాగా, ప్రజాపాలన వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement