
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది.
ఆస్పత్రుల వద్ద బ్యానర్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉన్నట్లు నోటీస్ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, అంచనా వివరాలు
జిల్లా చేసిన బకాయిలు
సర్జరీలు (రూ.లలో..)
గద్వాల 527 1,02,78,990
మహబూబ్‌నగర్ 19,032 46,95,71,170
నాగర్‌కర్నూల్ 133 34,03,362
నారాయణపేట 275 1,02,52,882
వనపర్తి 603 1,94,18,046
బకాయిలు రూ.కోట్లకు చేరడంతో ప్రైవేటు ఆస్పత్రుల విముఖత
సేవలు నిలిపివేతతో
పేదలకు ఆర్థిక ఇబ్బందులే..
మొదటి రోజు ఆస్పత్రులకు వచ్చి
తిరిగి వెళ్లిన రోగులు?