
పీయూ స్నాతకోత్సవానికి కమిటీలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వచ్చే నెల 16న పీయూ 4వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం వీసీ శ్రీనివాస్ అధ్యక్షతన పలు కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా రిజిస్ట్రార్ రమేష్‌బాబును, మెటీరియల్ కంటెంట్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, గోల్డ్‌మెడల్స్ కమిటీ చైర్మన్‌గా కంట్రోలర్ ప్రవీణ, ఫెలిసిటేషన్ కమిటీ చైర్మన్‌గా అధ్యాపకులు కిషోర్, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్‌గా వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, స్టేజ్, ఆడిటోరియం కమిటీ చైర్మన్‌గా ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ నాగం కుమారస్వామిని నియమించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ స్నాతకోత్సవం నిర్వహణలో కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, కార్యక్రమాన్ని విజయంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.