
లోక్‌అదాలత్‌లో 23,967 కేసులు పరిష్కారం
నాగర్‌కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్, ఎలక్ట్రిసిటీ, బ్యాంక్, పెట్టి కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా ఇరువర్గాలకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 23,967 కేసులు పరిష్కారం కాగా.. కాంపౌండింగ్ ఫీజు కింద రూ. 61,89,914 వసూలైందని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా మాట్లాడుతూ.. కక్షిదారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్‌అదాలత్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం లోక్‌అదాలత్‌లో రాజీ అయిన కక్షిదారులకు జిల్లా జడ్జి చేతులమీదుగా అవార్డు కాపీలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్‌జడ్జి వెంకట్రామ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి శృతిదూత, ఫస్ట్‌క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి, డీఎస్పీలు శ్రీనివాసులు, సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమాకాంత్‌రావు, కార్యదర్శి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.