
పరిషత్ ఓటర్లు @ 6,47,342
● 214 ఎంపీటీసీ స్థానాలకు 1,224 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
● ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్రణాళిక
అచ్చంపేట: జిల్లా, మండల పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. ప్రాదేశిక ఎన్నికల కసరత్తులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల ఆయా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లా పరిషత్‌తోపాటు ఎంపీడీఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 6,47,342 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 3,23,016 మంది పురు షులు, 3,24,315 మంది మహిళలు, 11 మంది ఇతరులు ఉన్నారు. 460 గ్రా మ పంచాయతీల పరిధిలో 214 ఎంపీటీసీ స్థానా లు ఏర్పాటు కాగా 1,224 పోలింగ్ కేంద్రాల వారీ గా ఖరారయ్యాయి. హైకోర్టు తీర్పును అనుసరించి ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సమస్య నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా అధికారులు మాత్రం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.