
జిల్లాలో జోరువాన
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో శనివారం జోరువాన కురిసింది. కొల్లాపూర్, బల్మూర్ తదితర మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునిగాయి. జిల్లాకేంద్రంలో అత్యధికంగా 22 మి.మీ. వర్షపాతం నమోదైంది. వంగూరు మండలంలో 16.5 మి.మీ. వర్షం కురిసింది. పదరలో 6.5, తెలకపల్లిలో 6.3, అమ్రాబాద్‌లో 5.5, అచ్చంపేటలో 5.3, లింగాలలో 5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 22 మి.మీ. వర్షపాతం