
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి..
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా విలువలను కాపాడటంలో స్ఫూర్తిగా ఉండాలి. ప్రజల అభిప్రాయాలను తెలిపే పత్రికలను ప్రభుత్వాలు గౌరవించాలి. ఆంధ్రప్రదేశ్‌లో పాత్రికేయులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.
– బవాండ్ల వెంకటేశ్, టీఎన్జీవో ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
‘సాక్షి’ పత్రిక ఎడిటర్, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులను భయపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల గొంతుకగా నిలిచే పత్రికలపై దాడులను ప్రజలు సహించరు. ప్రతిపక్ష నాయకుల ప్రెస్‌మీట్లను ప్రచురించినా కేసులు పెట్టడం అన్యాయం. – పొదిల్ల రామయ్య,
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి,
నాగర్‌కర్నూల్
పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. భావ ప్రకటన హక్కులో భాగమైన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు కాపాడాలి. పత్రికల్లో వచ్చిన వార్తలను ఏకీభవించకపోతే రిజాయిండర్, ఖండన ఇవ్వాలి. కానీ, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు. ఏకంగా పత్రికా ఎడిటర్‌పైనే కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌లో విచారించడం కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుంది. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉంది.
– బోనాసి రామచందర్,
న్యాయవాది, నాగర్‌కర్నూల్

రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి..

రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి..