
జర్నలిస్టులపై కేసులు అన్యాయం
ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పత్రికలు రాసే కథనాలను విమర్శలుగా తీసుకుని వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి కానీ, జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయడం సరికాదు. ‘సాక్షి’ పత్రికపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాల పనితీరుపై కథనాలు రాసే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ రాసిన కథనాల్లో ఏదైనా తప్పులు ఉంటే వాటిని ఆధారాలతో సహా నిరూపించుకోవాలి. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా విమర్శను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి తప్ప విమర్శ చేసే వారిని హింసకు గురిచేస్తాం.. టార్గెట్ చేస్తాం.. అంటే కుదరదు. ఒక రచయిత, జర్నలిస్టుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం అన్యాయం.
– రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్
అధికారం ఉందనే అహంతో పత్రికల స్వేచ్ఛను హరించడం కరెక్ట్ కాదు. అధికారం ఐదేళ్లు మాత్రమే.. చివరగా సమాజానికి జర్నలిజం అనేది శాశ్వతం. రాజకీయాల ముసుగులో అధికారంలో ఉన్నామనే అహంతో ‘సాక్షి’ దినపత్రికపై కేసులు మోపడం కక్షసాధింపులకు దిగడం సరికాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమాజ శ్రేయస్కరం కాదు. ఒకవేళ పత్రికా ప్రకటనలలో తప్పుగా ఉంటే వాటికి వివరణ కోరాలి తప్ప ఫోర్త్ ఎస్టేట్‌పై ఉక్కుపాదం మోపడం దారుణమైన చర్య.
– కొత్త కల్యాణ్‌రావు, ఎన్‌ఆర్‌ఐ,
కేఎంఆర్ ట్రస్టు చైర్మన్, చిన్నంబావి
ప్రభుత్వం ఎవరైనా ప్రజా, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టడం భావ ప్రకటన రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని ప్రభుత్వం కాలరాయడం హాస్యాస్పదం. ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదు. ఇప్పటికై నా ఏపీ సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడితే వారికే మంచిది.
– జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట

జర్నలిస్టులపై కేసులు అన్యాయం

జర్నలిస్టులపై కేసులు అన్యాయం